జగ్గయ్యపేట పరిధిలోని రైతులు తాము సాగు చేస్తున్న పంటల వివరాలను ఈ-క్రాప్ పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిణి విజయకుమారి కోరారు. శనివారం గరికపాడు KVKలో ఖరీఫ్ సన్నద్ధతపై నిర్వహించిన వర్క్షాప్లో ఆమె పాల్గొన్నారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున, రైతులు వ్యవసాయ శాఖ సూచించిన ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు.