జగ్గయ్యపేట మండలం షేర్ ముహమ్మద్‌పేట జాతీయ రహదారిపై శనివారం రాత్రి తౌడు బస్తాలతో వెళ్తున్న టాటా ఏసీ వాహనం బోల్తా పడటంతో బస్తాలన్నీ రోడ్డుపై పడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. సకాలంలో స్పందించి రాకపోకలను పునరుద్ధరించిన పోలీసులకు వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు.