శుక్రవారం జగ్గయ్యపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఎస్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు భారీ ధర్నా నిర్వహించారు. 12వ పీఆర్సీ ఏర్పాటు చేసి 30% ఐఆర్ ప్రకటించాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరుతూ తహశీల్దార్కు వినతిపత్రం అందజేశారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని కూడా వారు కోరారు.