వత్సవాయి: పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట!

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువజంట, తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణభయం ఉందని ఆరోపిస్తూ రక్షణ కోసం శనివారం వత్సవాయి పోలీసులను ఆశ్రయించారు. పర్చూరుకు చెందిన 23 ఏళ్ల యువతి, మక్కపేటకు చెందిన 24 ఏళ్ల యువకుడు విజయవాడలో చదువుకుంటున్నప్పుడు ప్రేమలో పడ్డారు. పెద్దలు అంగీకరించకపోవడంతో పల్లగిరి గుట్టలో వివాహం చేసుకున్నారు. తమ వివాహాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నారని వారు ఫిర్యాదు చేయగా, ఎస్ఐ ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్