కైకలూరులో దొంగతనం కేసులో పాత నేరస్థుడు అరెస్టు

గత ఏడాది సెప్టెంబరులో కైకలూరులోని జలగం శివశేషు ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, గుంటూరు జిల్లాకు చెందిన పాత నేరస్థుడు కంచర్ల మోహన్ రావును అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి 16 కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో 29 కేసుల్లో శిక్ష అనుభవించిన ఇతనిపై డీసీ షీట్ తెరుస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్