ఇబ్రహీంపట్నంలోని శ్రీ ధనఆంజనేయ స్వామి ఆలయంలో మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ నిరసన తీవ్రమై, జోగి రమేష్ ఇంటిపై దాడి చేసి తగలబెట్టినట్లు సమాచారం. ఈ సంఘటనతో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు భారీగా మోహరించారు.