గుడివాడకు వెళ్లే ధైర్యం లేక ఇంట్లో కూర్చొని హౌస్ అరెస్ట్ డ్రామా

గుడివాడకు వెళ్లే ధైర్యం లేకపోయి ఇంట్లో కూర్చొని హౌస్ అరెస్ట్ డ్రామా చేశాడని పేర్ని నానిని ఆదివారం మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఎస్పీ కూడా హౌస్ అరెస్ట్ చేయలేదన్నారని జడ్పీ చైర్మన్ హారిక, రాము దంపతులు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారని ఆరోపించారు. సభలు పెట్టుకోవడంలో అభ్యంతరం లేదు గానీ రెచ్చగొట్టే కార్యక్రమాలపై ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మచిలీపట్నంలో వంగవీటి మోహన రంగా ఫ్లెక్సీ చించి అశాంతిని సృష్టించాలని చూస్తున్నారని దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించామన్నారు.

సంబంధిత పోస్ట్