ఏప్రిల్ 24 నుంచి జూన్ 10 వరకు విద్యార్థుల భద్రత కోసం చేపట్టిన బస్సు తనిఖీల్లో కృష్ణా జిల్లాలో 35% లక్ష్యం మాత్రమే చేరగా, ఎన్టీఆర్ జిల్లా 63% లక్ష్యాన్ని అధిగమించింది. కృష్ణా జిల్లాలో 773 బస్సులకు 280 మాత్రమే తనిఖీ చేయగా, ఎన్టీఆర్ జిల్లాలో 976 బస్సులకు 621 తనిఖీ చేశారు. కృష్ణాలో 138, ఎన్టీఆర్‌లో 54 బస్సులు రోడ్డుకు అనర్హమని తేలింది. పర్మిట్లు లేని బస్సులు కృష్ణాలో 13, ఎన్టీఆర్‌లో 22 ఉన్నట్లు అధికారులు తెలిపారు.