గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాలున్నా, ఫిల్టరేషన్ సరిగా లేక నీరు దుర్వాసన వస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నీరు తాగడానికి పనికిరాకపోవడంతో, మళ్లీ పాతకాలపు ఊట బావులనే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పథకాలు కేవలం రికార్డులకే పరిమితమయ్యాయని, స్వచ్ఛమైన నీరు అందక రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.