పదవీ పోవటంతో మతిస్థిమితం కోల్పోయిన మాజీ మంత్రి పేర్ని నాని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మచిలీపట్నం జనసేన పార్టీ ఇంచార్జ్, డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ హత్య రాజకీయాలకు ప్రేరేపించేలా పేర్ని నాని మాట్లాడుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అండతో చీకటిలో కన్ను కొట్టేలోపే పని కాని చేయాలని మాట్లాడడం పద్ధతి కాదని పేర్కొన్నారు.