మచిలీపట్నం: చిత్తశుద్ధితో పరిష్కరించాలని 'మీకోసం' కార్యక్రమం

ప్రజల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కారం చేయాలనే దృక్పథంతో 'మీ కోసం' కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు అన్నారు. సోమవారం మచిలీపట్నం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన 'మీ కోసం' కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు మీకోసం కార్యక్రమంలో వారి సమస్యలను గూర్చి ఫిర్యాదు చేయగా, వారి ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్