ఉప్పాల హారికపై జరిగిన దాడిని రాష్ట్ర గౌడ సంఘం నేతలు ఖండించారు. ఈ క్రమంలో ఆ సంఘం నేతలు ఆమె ఇంటికి వెళ్లి ఆమెకు సంఘీభావం తెలిపారు. బీసీ మహిళగా జడ్పీటీసీగా ఎన్నికై జిల్లా ప్రథమ పౌరురాలిగా గుర్తింపు పొందినట్లు గుర్తు చేశారు. అగ్రకుల నాయకులు అసహనంతో దాడులకు పాల్పడుతున్నారని సంఘం ఉపాధ్యక్షుడు యార్లగడ్డ గోవర్ధన్ రావు విమర్శించారు.