భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శారీరక దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్స్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర గురువారం పాల్గొన్నారు. దివ్యాంగులకు రూ. 45 లక్షల విలువైన 150 ట్రై సైకిల్స్ పంపిణీ చేయడం సంతోషంగా ఉందని, సీఎస్ఆర్ నిధులతో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. అనివార్య కారణాలతో కదల్లేని స్థితిలో ఉన్నవారికి వాహనాలు సమకూర్చడం మానవతా దృక్పథానికి నిదర్శనమని అన్నారు.