ప్రతి ఒక్క బుల్లెట్ లక్ష్యాన్ని ఛేదించేలా తర్పీదు పొందాలని జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధరరావు అన్నారు. శుక్రవారం మచిలీపట్నం శివారు మంగినపూడి ఫైరింగ్ రేంజ్ ప్రాక్టీసులో ఎస్పీ స్వయంగా పరిశీలించారు. ఈ ఫైరింగ్ లో ప్రతి అధికారి పాల్గొని మంచి మెళకువలు నేర్చుకొని, ఫైరింగ్ నందు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఫైరింగ్ రేంజ్ నందు క్రమశిక్షణ అత్యంత ప్రాముఖ్యం వహిస్తుందన్నారు.