మచిలీపట్నం: కాలువల పనులను త్వరగా పూర్తి చేయాలి

జిల్లాలో వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి సాగునీటి, మురుగు కాలువల్లో తూడు, పిచ్చి మొక్కలు తొలగింపు, పూడికతీత, మరమ్మతు పనులను తప్పనిసరిగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో జలధార – జల హారతి కార్యక్రమం పురోగతి, అలాగే సాగునీటి కాలువల పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్