రాష్ట్ర గనుల మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలోని 16వ డివిజన్‌లో పెన్షన్ల పంపిణీని ప్రారంభించారు. పేదలకు ఆర్ధిక భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఆయన తెలిపారు. పలువురి ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించి, వారి కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పీఎం ఆవాస్ యోజన పథకం కింద గృహ నిర్మాణానికి మంజూరైన నిధుల చెక్కులను కూడా లబ్దిదారులకు అందించారు.