మచిలీపట్నం మండలం బుద్దాలపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులతో కలిసి సోమవారం డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ భోజనం చేశారు. అనంతరం కొద్దిసేపు విద్యార్థులతో ముచ్చటించారు. ప్రతిరోజు రుచికరంగా ఆహారాన్ని అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనం పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు.