మొహర్రం సందర్భంగా షియా ముస్లిం సోదరులకు, ఆస్థానాలకు ఆర్థిక సాయం చెక్కులను మంత్రి కొల్లు రవీంద్ర అందించారు. గురువారం మచిలీపట్నంలోని మసీదులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మైనార్టీ సంక్షేమానికి రూ. 5000 కోట్ల బడ్జెట్, సబ్ ప్లాన్ ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. మైనార్టీల అభివృద్ధికి అండగా నిలిచామని, మచిలీపట్నంలో 109 మంది స్థానాలకు రూ. 6 లక్షల ఆర్థిక సాయం అందించడం సంతోషంగా ఉందన్నారు