రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన సమస్యను రాజకీయం చేయవద్దని టీడీపీ నాయకులు, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం అన్నారు. గురువారం మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇద్దరు వ్యక్తుల మధ్య రాజకీయ పార్టీలు కాపురం చేయించలేవని తేల్చి చెప్పారు. తన కుమారుడు పల్లపాటి అభినవ్, మేకల జాహ్నవి ప్రేమించుకున్నారని తెలిపారు. పెద్దల అంగీకారంతో సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని అన్నారు.