ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల అధ్యక్షులుగా నియమితులైన వారు రైతుల సంక్షేమానికి కృషి చేయాలని డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ తెలిపారు. ఆదివారం వాడపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ అధ్యక్షునిగా దారపు రెడ్డి వీరాంజనేయ ప్రసాద్ చంటి బాబు పదవీ ప్రమాణ స్వీకార బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా త్రి కమిటీని రామకృష్ణ అభినందించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు మేలు జరుగుతుందన్నారు.