మచిలీపట్నం: ప్రతి ఓటరు భాగస్వామి కావాలి

భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ -2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఓటరు సహకరించాలని 75-మచిలీపట్టణం అసెంబ్లీ నియోజకవర్గం, బందరు ఆర్డీవో కే సాంబశివరావు కోరారు. శుక్రవారం సాయంత్రం ఆయన మచిలీపట్నం ఉత్తర మండల తహసిల్దార్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి ఎన్నికల జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, తొలగించుకోవాలని, మార్పులు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్