సోమవారం రాత్రి మచిలీపట్నం లక్ష్మీటాకీస్ సెంటర్లో రన్నింగ్లో ఉన్న సఫారీ కారు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. శ్రీనివాస్ నగర్ కు చెందిన ఓ కుటుంబం గుంటూరు వెళ్లి వస్తుండగా, ఇంజిన్లో వైర్లు షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. అప్రమత్తమైన స్థానికులు నీళ్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.