గుడివాడలో కృష్ణాజిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక మీద తెలుగుదేశం పార్టీ గూండాల చేసిన దాడిని మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ శనివారం ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా ప్రజా ప్రతినిధి అని కూడా చూడకుండా జడ్పీ చైర్ పర్సన్ పై అత్యంత దూరంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని, కక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్నారు.