టీడీపీ నేత పల్లపాటి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శుక్రవారం మచిలీపట్నంలో మాట్లాడుతూ మంత్రి కొల్లు రవీంద్ర డైరెక్షన్ లో ఆయన ముఖ్య అనుచరుడైన సుబ్రహ్మణ్యం వ్యక్తిగత గొడవల్లోకి తనను, తన కొడుకుని ఎందుకు లాగుతున్నారో అర్ధం కావట్లేదన్నారు. నీ పుత్ర రత్నం ఒక ఆడపిల్లకు మాయ మాటలు చెప్పి ఎక్కడికో తీసుకెళ్లి తాళి కడితే విడదీసింది నువ్వు కాదా అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.