గుడివాడ కార్యకర్తల సమావేశంకు హాజరుకాకుండా ముందస్తుగా మాజీ మంత్రి పేర్ని నానిని మచిలీపట్నం పోలీసులు శనివారం సాయంత్రం హౌస్ అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం పామర్రులో జరిగిన కార్యకర్తల సమావేశంలో పేర్ని నాని వ్యాఖ్యలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుకు సన్నాహాలు జరుగుతున్నాయి. హౌస్ అరెస్ట్ నేపథ్యంలో పేర్ని నాని నివాసంలో పామర్రు మాజీ శాసనసభ సభ్యులు కైలా అనిల్ కుమార్ భేటి అయ్యారు.