మచిలీపట్నం: మాజీ మంత్రి వీధి రౌడీలా మాట్లాడుతున్నారు

వైసీపీ కార్యకర్తల సమావేశాల్లో వీధి రౌడీ మాదిరి మాజీ మంత్రి పేర్ని నాని ప్రసంగాలు ఉన్నాయని మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కుంచే నాని శనివారం ధ్వజమెత్తారు. 'రప్పా. రప్పా. ఏమిటి. ఏం చేసినా చీకట్లో కన్ను కొట్టి చేసేయడమే' అని కార్యకర్తల సమావేశంలో పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన పేర్ని నానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్