మచిలీపట్నంలో ఆదివారం, వైసీపీ మాజీ కౌన్సిలర్ కోసూరు నాంచారయ్య వైన్ షాప్ లైసెన్స్ హోల్డర్ పసుపులేటి అనిల్‌పై దాడి చేశారు. ఈ దాడిలో అనిల్ తీవ్రంగా గాయపడి, సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడి అనంతరం నాంచారయ్య ఆత్మహత్యాయత్నం చేసుకోగా, అతన్ని చిన్నాపురం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.