మచిలీపట్నం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ జగదీష్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం చైతన్య కళాశాల బస్ డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలు, విద్యార్థుల భద్రత, వాహనాల పర్యవేక్షణ, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదనే అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్లు తప్పనిసరిగా వేగ పరిమితులను పాటించాలని, వాహనాలు సక్రమంగా మెయింటెనెన్స్‌లో ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.