రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపి తీరుతానని పేర్కొన్నారు. శనివారం మచిలీపట్నం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న ఆయన, మంగినపూడి బీచ్ లో అభివృద్ధి పనులను పరిశీలించారు. మచిలీపట్నాని పర్యాటక కేంద్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని తెలిపారు.