సమాజ వికాసంలో మీడియా పాలు పంచుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ కోరారు. ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం మీడియా ప్రభుత్వంతో సమన్యంగా వ్యవహరించాలని కలెక్టర్ బాలాజీ ఆకాంక్షించారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) ఆధ్వర్యంలో శుక్రవారం మచిలీపట్నంలో కృష్ణాజిల్లా జర్నలిస్టులకు వర్క్ షాప్ నిర్వహించారు. బాలాజీ మాట్లాడుతూ సమాజ వికాసం కోసంమీడియా ప్రభుత్వ ఆలోచనలతో జతకట్టి పనిచేయాలన్నారు.