జులై 16న మచిలీపట్నంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ డి. కె. బాలాజీ అన్నారు. సోమవారం మచిలీపట్నం ఇందుకు సంబంధించిన కరపత్రాలను కలెక్టర్, ఇతర అధికారులు ఆవిష్కరణ చేశారు. ఈ జాబ్ మేళాలో ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, డైకిన్ ఎయిర్ కండీషనింగ్ ప్రైవేట్ లిమిటెడ్, తదితర కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు.