మచిలీపట్నం నగర పాలక సంస్థ కార్మికులకు మార్చి నెల వేతనాలను తక్షణమే ఇప్పించాలని సీపీఎం నాయకులు మంత్రి కొల్లు రవీంద్రను కోరారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలకు వచ్చిన మంత్రిని సీపీఎం కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం కలిసి వినతి పత్రం అందజేశారు. 9వ తేదీ వచ్చినా వేతనాలు అందకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్పందించిన మంత్రి వేతనాల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.