మచిలీపట్నం: కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి

విజయవాడ కనకదుర్గమ్మ వారిని మంత్రి కొల్లు రవీంద్ర దంపతులు శుక్రవారం ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. మంత్రి దంపతులకు అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని దుర్గగుడి అధికారులు అందజేశారు. ఆషాడ మాస ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకున్నట్లు మంత్రి రవీంద్ర తెలిపారు. పూజా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్