ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు గంట పాటు జరిగిన ఈ సమావేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలు, వాటి పరిష్కారానికి కేంద్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ చర్చలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.