మచిలీపట్నం కొబ్బరి తోటలో నగరపాలక సంస్థ అధికారులు అక్రమంగా ఇంటిని కూల్చివేసిన బాధితులకు ఎంపీ బాలసౌరి బుధవారం అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బాధితులను పరామర్శించి, ధైర్యం చెప్పిన ఆయన, అన్ని అనుమతులు తీసుకొని ఇంటిని తిరిగి నిర్మిస్తానని వెల్లడించారు. జన సైనికులకు అన్యాయం జరిగితే సహించబోమని తెలిపారు.