పేర్ని నానీ. నోరు అదుపులో పెట్టుకో టీడీపీ నాయకులు హెచ్చరించారు. ఆదివారం మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో నేతలు మాట్లాడారు. మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే తాట తీస్తామన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రాన్ని జగన్ రెడ్డి అధోగతిపాలు చేశాడని, మూడు తరాల రాజకీయ జీవితంలో ఎవరికైనా పట్టెడన్నం పెట్టావా? అని ప్రశ్నించారు. సేవా కార్యక్రమాలతో పేదల ఆకలి తీరుస్తున్న ఘనత కొల్లు కుటుంబానిదన్నారు.