మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన మైరా బే వ్యూ రిసార్ట్స్ భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. కొత్త పర్యాటక విధానంలో భాగంగా, తాళ్లపాలెంలో 20 ఎకరాల్లో రూ. 157.53 కోట్లతో లార్జ్ అమ్యూజ్‌మెంట్ పార్క్ కం రిసార్ట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో అమ్యూజ్‌మెంట్ పార్క్‌తో పాటు వాటర్ పార్క్ & రైడ్‌లు, రెస్టారెంట్లు, కన్వెన్షన్ సెంటర్, వెల్నెస్ స్పాలు, స్విమ్మింగ్ పూల్స్ కూడా ఏర్పాటు చేయబడతాయి.