మచిలీపట్నం కలెక్టరేట్ లోని చాంబర్ నందు జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మను నూతన డిఎస్ఓ కె. మోహన్ బాబు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనరేట్ నుండి కృష్ణా జిల్లా డిఎస్ఓగా బదిలీపై మోహన్ బాబు వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్, జెసికి పూల మొక్కను అందజేశారు.