మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, టీడీపీ గొడ్డలి పార్టీలాగా మడమ తిప్పే పార్టీ కాదని అన్నారు. గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఇంటింటికీ సంక్షేమాన్ని అందించిందని, దేశ చరిత్రలోనే లేనివిధంగా 63 లక్షల మందికి రూ. 65వేల కోట్ల పెన్షన్లు ఇచ్చామని తెలిపారు. 'తల్లికి వందనం' కింద రూ. 15వేలు, 'అన్నదాత సుఖీభవ' ద్వారా రైతులకు రూ. 20వేలు, 'దీపం-2' కింద 4.26 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేశామని ఆయన పేర్కొన్నారు.