మచిలీపట్నం: లోటుపాట్లు తెలుసుకునేందుకు పేరెంట్స్ మీటింగ్

విద్యార్థులు చదువులో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయో తెలుసుకునేందుకు పేరెంట్స్ మీటింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గురువారం 'తల్లికి వందనం' నగదు ఇంటర్మీడియట్ విద్యార్థులకు జమచేస్తున్న నేపథ్యంలో మచిలీపట్నం నారాయణ కాలేజీలో పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి ఇలాంటి సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.

సంబంధిత పోస్ట్