మచిలీపట్నం: పెనుమల్లి పొక్సో కేసు కొట్టివేత

కృష్ణాజిల్లా పొక్సో కోర్ట్ న్యాయమూర్తి గాజుల వెంకటేశ్వర్లు, గుడివాడ డి.ఎస్.పి పరిధిలోని ముదినేపల్లి మండలం పెనుమల్లి శివారు సింగవరం గ్రామానికి చెందిన యువకుడిపై 2021లో నమోదైన పోక్సో కేసును సోమవారం కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. సింగవరం గ్రామానికి చెందిన వేము రవితేజ, అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని గతంలో ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయగా, విచారణ అనంతరం కోర్టు ఈ తీర్పు వెలువరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్