మచిలీపట్నం స్థానిక బస్టాండ్ సమీపంలో తీవ్రమైన ఎండ వేడిమికి ఒక వ్యక్తి స్పృహ తప్పి పడి ఉన్నాడు. చుట్టుపక్కల వారు గమనించినా ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఈ పరిస్థితిని గమనించిన స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ దుర్గారావు వెంటనే స్పందించి, ఆ వ్యక్తికి ప్రథమ చికిత్స అందించి, 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు స్పందించడం అందరూ చేయాలని ఆయన ఉదాహరణగా నిలిచారు.