ఇరాన్ లో దాడులకు పాల్పడుతున్న అమెరికా, ఇజ్రాయెల్ దేశాల ఉన్మాద చర్యలను వామపక్షాల నేతలు తీవ్రంగా ఖండించారు. పశ్చిమ ఆసియాలో శాంతియుత వాతావరణానికి ప్రపంచ దేశాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం మచిలీపట్నం పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ నిరసనలో సిపిఎం సీనియర్ నాయకులు శర్మ, నగర కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు చిరువోలు జయరావు, చంద్రపాల్, పి. నాగయ్య తదితరులు పాల్గొన్నారు.