చల్లపల్లి మండలం లక్ష్మీపురం శివారు చింతలమడ పరిధిలోని చెన్నకేశవకోడు పక్కన ఉన్న డ్రెయినేజీ పోరంబోకు భూమిలో చెరువు తవ్వకాలను అడ్డుకోవాలని రైతులు జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీని సోమవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. చెరువు తవ్వకం ద్వారా చెన్నకేశవకోడుపై ఆధారపడ్డ చింతలమడ, బిరుదుగడ్డ, దేవరకోట, దాలిపర్రు గ్రామాలకు చెందిన రైతులు సాగుచేస్తున్న సుమారు 300 ఎకరాలు బీడుగా మారే అవకాశం ఉందని తెలిపారు.