బైండోవర్‌కు గురైన వ్యక్తులు నిబంధనలను పాటించకుండా తిరిగి నేరాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు బుధవారం హెచ్చరించారు. ఇటీవల కృష్ణా జిల్లాలో గుడివాడ వన్‌టౌన్, మచిలీపట్నం ఆర్‌పేట, ఇనుకుదురు పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు వ్యక్తులు బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించామని ఆయన తెలిపారు. ఈ నిబంధనలను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.