జిల్లాలో యూరియాను పంటలకు కాకుండా ఇతర అవసరాలకు దారి మళ్లించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం నగరంలోని తన చాంబర్‌లో జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించి, యూరియా సరఫరాపై దిశానిర్దేశం చేశారు. రైతులందరికీ సకాలంలో యూరియా అందేలా చూడాలని ఆయన సూచించారు.