మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం కుమారుడికి పల్లపాటి అభినవ్ కు 14 రోజులు రిమాండ్ న్యాయస్థానం శుక్రవారం విధించింది. నిందితుడిని మచిలీపట్నం సబ్ జైలుకు పోలీసులు తరలించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన యువతని మోసగించిన అభినవ్ విషయం కృష్ణా జిల్లాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తుంది. వైసీపీ, టీడీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.