మచిలీపట్నం బైపాస్ రోడ్డులో శనివారం అర్థరాత్రి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వంగవీటి మోహన్ రంగా ప్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించివేయగా, జనసైనికులు ఆందోళనకు దిగారు. వంగవీటి రంగా ప్లెక్సీ చించివేతపై జనసైనికులు భగ్గుమన్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. జనసైనికులు పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా ప్లెక్సీలు చించివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తపరిచారు.