కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారికపై దాడి అత్యంత దారుణమని కృష్ణాజిల్లా వైసిపి పార్టీ మహిళ అధ్యక్షురాలు శీలం భారతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మచిలీపట్నంలో ఆమె మాట్లాడారు. మహిళా బీసీ ప్రజా ప్రతినిధి అని కూడా చూడకుండా టిడిపి, జనసేన నాయకులు చేసిన దాడిని రాష్ట్ర ప్రజలు గమనించారని తెలిపారు. ప్రభుత్వం కచ్చితంగా దాడి చేసిన వారిపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.