కూటమి ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు అందరికీ అందుతాయని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం మచిలీపట్నంలోని ఆరిసేపల్లి శివారు చిట్టిపాలెంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు నెల నుంచి నూతనంగా స్పోజ్ పింఛన్లు కూడా పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.